![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1006 లో.....ఇంట్లో ఇందు కిడ్నాప్ గురించి అందరు మాట్లాడుకుంటారు. అప్పుడే కానిస్టేబుల్ ని తీసుకొని నందు ఎంట్రీ ఇస్తుంది. ఎవరు నువ్వు అని తనని రేఖ అడుగుతుంది. మీరే కదా సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చెయ్యమని అన్నారంట కదా అందుకే డిపార్ట్మెంట్ నన్ను పంపించిందని నందు చెప్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇంట్లో నుండే స్టార్ట్ చెయ్యాలని నందు చెప్తుంది. ఇక్కడ అవసరం లేదు బయట ఇన్వెస్టిగేషన్ చేస్కోండి అని భ్రమరాంబ అంటుంది. తనకి కౌంటర్ వేస్తూ నందు మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఆ ఇందు దొరికే వరకు ఇక్కడే ఉంటారా అని భ్రమరాంబ అంటుంది. మీరు మాకు సహకరించకపోతే మేం వెళ్ళిపోతామని నందు అనగానే లేదు అన్ని ఏర్పాట్లు చేస్తామని రేఖ అంటుంది.
ఇన్వెస్టిగేషన్ కి అవసరం అయినా సిస్టమ్స్ అన్ని భూషణ్ తో చెప్పి రేఖ తెప్పిస్తుంది.ఆ తర్వాత నందు పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావ్.. ఏదో నీ పుట్టింటికి వచ్చినట్లు అని భ్రమరాంబ అనగానే అదేం లేదు ఇక్కడ ఫొటోస్ ఉంటే చూస్తున్నానని నందు అంటుంది. మరొకవైపు ఇందుకి భోజనం తీసుకొని వెళ్తారు లక్కీ, రాజు. ఒక చేతి కట్టు విప్పి భోజనం చెయ్యమని చెప్తారు. ఇందుకి లక్కీ నీళ్లు తాగిస్తుంటే లక్కీ మాస్క్ తీస్తుంది ఇందు. ఒరేయ్ లక్కీ నువ్వారా అని ఇందు అనగానే వెంటనే రాజు మాస్క్ కూడా లక్కీ తీసేస్తాడు. ఇద్దరిని చూసి ఇందు షాక్ అవుతుంది. మీరా నన్ను కిడ్నాప్ చేసిందని ఇందు షాక్ అవుతుంది.
ఆ తర్వాత నందుకి తన టీంకి భ్రమరాంబ టీ తీసుకొని వస్తుంది. అబ్బా ఎన్ని రోజులు అవుతుంది మా ఆవిడా కిచెన్ లోకి వెళ్లి అని శేషు అనుకుంటాడు. ఆ తర్వాత రేఖకి రాజు ఫోన్ చేస్తాడు. వెంటనే రేఖ తన ఫోన్ నందుకి ఇస్తుంది. మీరు మాట్లాడుతు ఉండండి. మేం ట్రేస్ చేస్తామని నందు అంటుంది. రాజు ఫోన్ చేసి మాకు ఒక కోటి ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తామని కట్ చేస్తాడు రాజు. అయ్యో ఎక్కువ సేపు మాట్లాడితే ట్రేస్ చేసావాళ్ళం.. మళ్ళీ చేస్తే నేను చెప్పే వరకు కట్ చెయ్యకని రేఖకి నందు చెప్తుంది. ఆ తర్వాత కాల్ ట్రేస్ చేస్తున్న విషయం వాళ్లకి చెప్పాలని రాజుకి ఐశ్వర్య ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చెయ్యరు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |